హోర్డింగ్స్, ఎగ్జిబిషన్లు స్టాల్స్ ఏర్పాటు చేయాలి

కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ( Super GST – Super Savings) కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల‌ని కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumit Kumar) కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జీఎస్టీ సంస్కరణలపై మాసాంతపు కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాల‌న్నారు. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి అవగాహన కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రముఖ కూడళ్ల వద్ద, మండల స్థాయిలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్లు స్టాల్స్ (Exhibitions Stalls) ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ఈరోజు, రేపు, సాధారణ విద్య, ఉన్నత విద్యశాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ట్రాక్టర్, ర్యాలీల ద్వారా గ్రామాలు, మండలాలలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలు, చేనేత శాఖలు వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపైన, వివిధ వైద్య సేవల పైన, ఆరోగ్య బీమాపై, ఎల్ఐసీ ఏజెంట్లు, డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లతో ప్రజల భాగస్వామ్యంతో సమీక్ష నిర్వహించి, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

రాబోయే కాలంలో ప్రజలు ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది పడకూడదు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో తిరిగి తాగునీటి సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించి దిశగా కృషి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు పంచాయత్ సెక్రటరీ పై ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో తిరగాలని, అలాగే నీటి పైపులైన్లు పరిశీలించి పగిలిన పైపులను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు, అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లాలో వర్షాలు ప్ర‌కృతి వైపరీత్య‌ రూపంలో వస్తాయని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు డెంగీ, మలేరియా బారిన పడకుండా, జిల్లా వైద్యశాఖ, మున్సిపాలిటీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలపై జిల్లా, మండల స్థాయి
డాక్యుమెంటేషన్ తయారుచేసి ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

Leave a Reply