Venkatalachimi | పోస్టర్ తో షాక్ ఇచ్చిన పాయల్..

Venkatalachimi | పోస్టర్ తో షాక్ ఇచ్చిన పాయల్..

Venkatalachimi, ఆంధ్ర్రప్రభ వెబ్ డెస్క్ : ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం.. సినిమాలతో యూత్ ఆడియ‌న్స్‌కు దగ్గరైన హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్ (Payal Rajput). ఈసారి వెంకటలచ్చిమి గెట‌ప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పాయల్‌ రాజ్‌పుత్ జన్మదినం సందర్భంగా డైరెక్ట‌ర్ ముని తెర‌కెక్కిస్తున్న మూవీ వెంకటలచ్చిమి. ఈ మూవీ నుంచి పాయల్ బర్త్ డే పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌ చూస్తేనే.. సినిమా ఎంత ఇంటెన్స్‌గా, ఎంత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది.

రాజా, పవన్ బండ్రేడ్డి నిర్మిస్తున్న‌ వెంకటలచ్చిమి మూవీ బర్త్ డే పోస్టర్ లో హీరోయిన్‌ను ఒక జైలు గదిలో పైకప్పుకు తలక్రిందులుగా వ్రేలాడితీసి చేతికి సంకెళ్లు, మెడలో మంగళసూత్రం ఉంచినట్టు కనిపిస్తుంది. రక్తపు మరకలు, భయానక వాతావరణం.. అన్ని కలిసిన ఈ పోస్టర్‌ సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. పోస్టర్‌ పై First Look & Glimpse Coming Soon అని ప్రకటించడం ద్వారా త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రానున్నట్లు మేకర్స్ తెలియజేశారు. బర్త్ డే పోస్టర్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ పాయల్ రాజ్‌పుత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని పేర్కొన్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు వెంకటలచ్చిమి అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పింది. పాన్‌ ఇండియా స్థాయిలో 6 భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తున్నారు. రాజా, పవన్ బండ్రేడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Leave a Reply