Vemulawada : ఆకస్మిక తనిఖీ…
- శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి
- సీఎం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు
- భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ రోజు ప్రభుత్వ విప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Sri Rajarajeshwara Swamy) ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చొరవతో నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు. శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి స్వామివారి అనుమతులతో ముందుకు పోతున్నామని, ఇటీవల స్వామి వారి స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి పలు సూచనలు సలహాలు చేశారని గుర్తు చేశారు.
వచ్చే భక్తులకు అర్జిత సేవల కోసం భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాట్లు చేశామని, స్వామివారి కళ్యాణం, కోడె మొక్కు(Kode Mokku), కుంకుమ పూజ, సత్యనారాయణ వ్రతం అన్ని రకాల ఆర్జిత సేవలకు భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసినట్లు వి వరించారు. ఆలయం ముందు రావి చెట్టు వద్ద భక్తులకు దర్శనం కోసం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల, భక్తుల మనోభావాలకనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు.
అన్ని వర్గాల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ(Telangana)తోపాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే రాజన్న భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వేములవాడ పట్టణ, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు రాజన్న ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చె శారు. ఆయనవ వెంట అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాధాబాయి(RDO Radhabai), ఈవో రమాదేవి, సిఐలు శ్రీనివాస్, వెంకటేష్, ఎస్సైలు, ఆలయ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.



