వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రి వైద్య‌లు ఘ‌న‌త‌

వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రి వైద్య‌లు ఘ‌న‌త‌

వేముల‌వాడ, ఆంధ్ర‌ప్ర‌భ : వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఈ రోజు అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌ను వైద్యులు నిర్వహించారు. కేవలం పెద్ద ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించే ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్(Plastic surgery operation)ను ఆర్థో వైద్యుడు డా.అనిల్ బృందం(Dr. Anil’s team) నిర్వ‌హించింది.

నరసింహాచారి అనే వ్యక్తికి తన కాలికి ఉన్న గాయానికి చర్మం పూర్తిగా పాడవడంతో తన చర్మాన్నే వేరొకచోటి నుండి తీసి గాయానికి అతికించారు. ఇటువంటి అరుదైన ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు హైద‌రాబాద్‌(Hyderabad) లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతాయి. ఇక్కడ సూపరింటిండెంట్ డాక్ట‌ర్‌ పెంచలయ్య ప్రోత్సాహంతో డా.అనిల్(Dr. Anil), మత్తు వైద్యులు డా.తిరుపతి సహకారంతో ఈ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. శ‌స్త్ర‌చికిత్స చేసిన డాక్ట‌ర్ అనిల్‌, సిబ్బందిని పెంచ‌ల‌య్య అభినందించారు. సిరిసిల్ల జిల్లా(Sirisilla District) ప్రజలు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆసుపత్రి కోరారు.

Leave a Reply