Velampalli | ప్రజాసేవకు నా జీవితం అంకితం చేస్తా..

Velampalli | ప్రజాసేవకు నా జీవితం అంకితం చేస్తా..

  • సర్పంచ్ అభ్యర్థి కూర వెంకటరాజిరెడ్డి

Velampalli | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వేలంపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూర వెంకట రాజిరెడ్డి పంచాయతీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ధిపై పలు కీలక హామీలు ఇస్తూ, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఆయన మాట్లాడుతూ.. “ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా” అని బలంగా చెప్పారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేస్తానని మాటిచ్చారు. కేవలం ఎన్నికల హామీలు ఇవ్వడం కాకుండా, గ్రామస్థాయిలో నిజమైన మార్పును తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి నిర్ణయంలోనూ గ్రామ ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో, గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకుని, తమకు కేటాయించిన ‘కత్తెర’ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కూర వెంకట రాజిరెడ్డి కోరారు.

Leave a Reply