సురక్షిత ప్రయాణం కుటుంబమంతా ఆనందనీయం..

సురక్షిత ప్రయాణం కుటుంబమంతా ఆనందనీయం..

జుక్కల్ మండల వ్యాప్తంగా గ్రామసభలు

జుక్కల్, ఆంధ్రప్రభ : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా 99 రోజుల కార్యచరణలో భాగంగా సోమవారం భద్రంగా ప్రయాణించు- సురీక్షితంగా ఇల్లు చేరు అనే అంశంపై జుక్కల్ గ్రామపంచాయతీతో పాటు డోన్ గాం గ్రామపంచాయతీ, మండలంలోని 28 గ్రామపంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీడీఓ బి.శ్రీనివాస్ ఎంపిఓ రాముతో పాటు ఇతరుల శాఖలకు చెందిన మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు, ఉద్యోగులు కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం పై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం త్రాగి వాహనాలు నడపకుండా ఉండటం, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడటం, హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపడం, తదితర ముఖ్య విషయాలపై గ్రామసభలు చర్చించటమే కాకుండా తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు గ్రామస్తులకు ఇవ్వటం జరిగింది.ప్రాణం విలువైందని, ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సురక్షిత ప్రయాణం తో కుటుంబ సభ్యులందరూ అనరుదాయకంగా ఉండటం జరుగుతుందని వివరించడం జరిగింది. ఈసందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply