పట్టుదలతోనే విద్యార్థులకు భవిష్యత్తు

పట్టుదలతోనే విద్యార్థులకు భవిష్యత్తు

  • వాసవి జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవం

కుంటాల, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి చదువుతోని విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని పట్టుదలతో చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని వాసవి కళాశాల ప్రిన్సిపల్ బోయి సాయిలు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాసవి కళాశాల 22వ వార్షికోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు పట్టుదలతో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు అని పేర్కొన్నారు. చదువు విద్యార్థులకు పునాది అని ఏదైనా సాధించాలంటే విద్యార్థులు చదివే మార్గమని పేర్కొన్నారు.

లక్ష్యంతో చదువుకుంటే జీవితం స్థిరపడాలంటే విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాబోయే పోటీ పరీక్షల్లో సైతం చెత్తా చాటేలా పరీక్షల్లో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తెలియజేశారు. విద్యార్థులు రానున్న పరీక్షలు నేపథ్యంలో చదువుపై ప్రత్యేక దృష్టి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి కళాశాల యొక్క గొప్పతనాన్ని నిలపాలని వివరించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అల్లరించారు మిమిక్రీ సైతం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ప్రిన్సిపల్ గట్టుపల్లి శ్రీనివాస్ డి సంతోష్ జానకిరామ్ హరిప్రసాద్ ఆధ్యాపకులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply