Varni | రోడ్డుపై బైఠాయించినబ నేతలు

Varni | రోడ్డుపై బైఠాయించినబ నేతలు

Varni | వర్ని, ఆంధ్ర ప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీట్ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్ని మండల కేంద్రంలో ఈ రోజు బీ ఆర్ ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజల కలలను సాకరం చేసిన కేసీఆర్ పై ప్రజలకున్న అభిమానాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ వేధింపులకుగురి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఎటువంటి ఇబ్బంది కలిగించిన కోరుకునేది లేదని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, గంగప్ప ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply