Vangaveeti Asha kiran | ఆదర్శప్రాయం రంగా జీవితం..

Vangaveeti Asha kiran | ఆదర్శప్రాయం రంగా జీవితం..

  • ప్రజల తరుఫున నిత్య పోరాటం..
  • ఏ పార్టీలోని ఇంకా చేరలేదు..
  • రాధా రంగా మిత్రమండలి బలోపేతమే లక్ష్యం..
  • వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్..

vangaveeti asha kiran, విజయవాడ, ఆంధ్రప్రభ : కులమత రాజకీయాలకతీతంగా వంగవీటి మోహన రంగా అందరివాడేనని దివంగత వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నగరంలోని రాఘవయ్య పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి.. రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మాట్లాడుతూ.. రంగా జీవితం అందరికి ఆదర్శం అన్నారు. ప్రజల పోరాటమే తన పోరాటం అని నమ్మిన వ్యక్తి రంగా అని, భౌతికంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికే ఉంటాడన్నారు. పేదవాళ్ళు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడు బ్రతికే ఉంటారని, తాను ఏ పార్టీ లోకి వెళ్లడం లేదని, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రంగా నాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదని, తాను ఎవర్ని వీడదీయడానికి రాలేదని, ఎవరి కార్యక్రమాలు వారికి ఉన్నందున ముందుగా తాను వచ్చి నివాళులు అర్పించినట్లు తెలిపారు. రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేస్తానని ప్రకటించారు.

Leave a Reply