వందేమాతరం.. స్వాతంత్ర్య స్ఫూర్తి గీతం

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వేడుకలు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శుక్రవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వందేమాతర గీతం కోట్లాది భారతీయులలో స్వాతంత్ర్య స్పూర్తి నింపిన గీతం. 1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని ర‌చించార‌ని, ఇది ఆనందమఠం నవలలో తొలిసారిగా ఇది ప్రచురితమైందని తెలిపారు.

వందేమాతరం గేయం దేశభక్తిని ప్రతిబింబించే అమూల్యమైన నినాదమని, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా వైద్యశాల ఆవరణలో వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది సమూహంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంఓ డా. వెంకటరమణ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. శివబాల, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. కిరణ్ కుమార్, డా. సుబ్రహ్మణ్యం, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply