Vanaparthi | 32వ వార్డులో ఇంటింటి ప్రచారం…

Vanaparthi | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యరేఖ నాగన్న యాదవ్ ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలు మద్దతుదారులతో భాగ్యరేఖ నాగన్న యాదవ్ వార్డు పర్యటన చేపట్టారు. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులను కలిసి తమ అభ్యర్థి త్వాన్ని వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో తమను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి మరింత కృషిచేస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తిలో జరిగిన ప్రగతి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.

Leave a Reply