మెదక్ : చిన్నకోడూరు మండలంలోని చందులాపూర్ (Chandulapur) గ్రామంలో గల పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాల (Polytechnic College) ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హేమావతి (Collector K Hemavati) పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వనమహోత్సవం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఉచితంగా మొక్కలను అందిస్తుందన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క పౌరుడూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, చిన్నకోడూరు తహసీల్దార్ సలీమ్ మియా, ఎంపీడీవో, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.