Vamsi paidipally | ఆమిర్ ఖాన్ తో అనుకుంటే.. ?

Vamsi paidipally | అమీర్ ఖాన్ తో అనుకుంటే.. ?

Vamsi paidipally, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో ఒక హీరో కోసం కథ రాస్తే.. మరో హీరోతో సెట్ అవ్వడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ఇప్పటి వరకు ఇలా ఎన్నో సార్లు జరిగింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని ఓ డైరెక్టర్ ట్రై చేస్తే.. మరో బాలీవుడ్ స్టార్ తో సినిమా సెట్ అయ్యిందని తెలిసింది. ఇంతకీ.. అమీర్ ఖాన్ కోసం కథ రాసిన డైరెక్టర్ ఎవరు..? అమీర్ ఎందుకు నో చెప్పారు…? ఇంతకీ.. ఎస్ చెప్పిన స్టార్ హీరో ఎవరు…?

అమీర్ ఖాన్ (Aamir khan) కోసం కథ రాసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ టాలీవుడ్ డైరెక్టర్ మున్నా సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. 2007లో మున్నా సినిమాతో పరిచయమైన వంశీ పైడిపల్లి మూడేళ్ల తర్వాత అంటే 2010లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం అనే సినిమా తెరకెక్కించారు. మున్నా సినిమాను నిర్మించిన దిల్ రాజే.. ఈ సినిమాను కూడా నిర్మించారు. ఎన్టీఆర్ ను కొత్తగా చూపించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యింది. ఆ విధంగా వంశీ పైడిపల్లికి తొలి సక్సెస్ వచ్చింది.

Vamsi paidipally | మున్నా తర్వాత మూడేళ్లు గ్యాప్

Vamsi paidipally

వంశీకి.. మున్నా తర్వాత మూడేళ్లు గ్యాప్ వస్తే.. బృందావనం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. ఈసారి చరణ్‌, బన్నీ (Allu Arjun) కాంబోలో ఎవడు అనే సినిమా చేశారు. ఈ సినిమాని కూడా దిల్ రాజే నిర్మించారు. భారీ యాక్షన్ మూవీగా రూపొందిన ఎవడు సినిమా మాస్ జనాలకు బాగా నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాగా నిలిచింది. ఎవడు సినిమా వచ్చిన రెండేళ్లకు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తీ కాంబోలో ఊపిరి అనే సినిమాను తెరకెక్కించారు వంశీ. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఊపిరి తెలుగు, తమిళ్ లో మంచి విజయం సాధించింది.

Vamsi paidipally

2016లో ఊపిరి వస్తే.. 2019లో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో (Mahesh babu) మహర్షి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రైతు కథాంశంతో రూపొందిన మహర్షి హీరో మహేష్‌ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీ రిలీజైన నాలుగు సంవత్సరాలకు అంటే.. 2023లో వారసుడు సినిమా రిలీజైంది. తెలుగు, తమిళ్ లో రూపొందిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ నటించారు. తమిళ్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఇంత వరకు వంశీ పైడిపల్లి కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. ఎందుకు సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నారు అని అడిగితే.. గ్యాప్ తీసుకోవడం లేదు.. గ్యాప్ వస్తుంది అంతే అని చెబుతుంటారు వంశీ.

Vamsi paidipally | ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కనుంది..?

ఈసారి వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్ తో సినిమా చేయాలి అనుకున్నారు. చాన్నాళ్లు కథ పై కసర్తు చేశారు. దాదాపుగా ఈ సినిమా కన్ ఫర్మ్ అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. కథ నచ్చలేదో.. లేక వేరే ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారో తెలియదు కానీ.. అమీర్ ఖాన్ నో చెప్పడంతో.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman khan) తో సినిమా చేయడం కోసం ట్రై చేశారు వంశీ పైడిపల్లి. ఆఖరికి అమీర్ నో చెప్పిన ఈ కథకు సల్మాన్ ఎస్ చెప్పారని సమాచారం. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నారు. ఇటీవల గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో నిర్మాత శిరీష్ ఈ వార్త లీక్ చేశారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కనుంది..? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి.. సల్మాన్ ను వంశీ పైడిపల్లి ఎలా చూపిస్తారో.. అసలు కథ ఎలా ఉంటుందో.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Vamsi paidipally

వంశీకి.. మున్నా తర్వాత మూడేళ్లు గ్యాప్ వస్తే.. బృందావనం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. ఈసారి చరణ్‌, బన్నీ (Allu Arjun) కాంబోలో ఎవడు అనే సినిమా చేశారు. ఈ సినిమాని కూడా దిల్ రాజే నిర్మించారు. భారీ యాక్షన్ మూవీగా రూపొందిన ఎవడు సినిమా మాస్ జనాలకు బాగా నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాగా నిలిచింది. ఎవడు సినిమా వచ్చిన రెండేళ్లకు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తీ కాంబోలో ఊపిరి అనే సినిమాను తెరకెక్కించారు వంశీ. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఊపిరి తెలుగు, తమిళ్ లో మంచి విజయం సాధించింది.

ఈసారి వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్ తో సినిమా చేయాలి అనుకున్నారు. చాన్నాళ్లు కథ పై కసర్తు చేశారు. దాదాపుగా ఈ సినిమా కన్ ఫర్మ్ అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. కథ నచ్చలేదో.. లేక వేరే ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారో తెలియదు కానీ.. అమీర్ ఖాన్ నో చెప్పడంతో.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman khan) తో సినిమా చేయడం కోసం ట్రై చేశారు వంశీ పైడిపల్లి. ఆఖరికి అమీర్ నో చెప్పిన ఈ కథకు సల్మాన్ ఎస్ చెప్పారని సమాచారం. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నారు. ఇటీవల గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో నిర్మాత శిరీష్ ఈ వార్త లీక్ చేశారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కనుంది..? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి.. సల్మాన్ ను వంశీ పైడిపల్లి ఎలా చూపిస్తారో.. అసలు కథ ఎలా ఉంటుందో.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Click Here To Read Series | ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌..

Click Here To Read More

Leave a Reply