పుస్తక ప్రదర్శనలో వైకుంఠ ఏకాదశి దివ్య కానుక !

  • ప్రఖ్యాత కవి యాకూబ్ ఉత్సాహవంతమైన భూమిక !
  • ప్రముఖ రచయిత పురాణపండ మంత్ర పేటిక !!

హైదరాబాద్ : భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర దివ్యత్వాన్ని మరికొన్ని అనంత మహిమల స్తోత్రాలతో, పరమ పవిత్ర సౌందర్య సొగసుల వ్యాఖ్యానాలతో నూట ఇరవై పేజీల పరమ శోభాయమాన గ్రంధంగా రూపుదిద్దిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు ప్రకటిస్తూ ఈసారి హైదరాబాద్ లో డిసెంబర్ 19 వ తేదీ నుండి జరుగనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో రెండు బుక్ స్టాల్స్ వారు ఈ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్ గ్రంధాన్ని వైకుంఠ ఏకాదశి పుణ్య కానుకగా వేల కొలది బుక్స్ ఉచితంగా ఇవ్వాలని పూనుకోవడం హర్షణీయం.

ఈ పుస్తకాల పండుగను విస్తృతంగా అందరిలోకి తీసుకెళ్లడం అవసరమని , అందులో భాగస్వాములు కావడం ఇంకా అవసరమని, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ , ప్రముఖ కవి యాకూబ్ ప్రకటించారు.

ఎన్టీఆర్ స్టేడియం లో ఏర్పాటైన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్రగీతం రచించిన ప్రజాకవి అందెశ్రీ పేరుమీద “ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణం”గా పేరు పెట్టడం జరిగిందని కమిటీ పేర్కొంది.

ఇప్పటికే జాతీయ స్థాయిలో వందలాది బుక్ స్టాల్స్ కొలువుతీరిన ఈ బుక్ ఫెయిర్ ఈ నెల 19 వ తేదీన లాంఛనంగా ప్రారంభం కానుంది. నేషనల్ బుక్ ట్రస్ట్ అఫ్ ఇండియా , తిరుమల తిరుపతి దేవస్థానములు, విశాలాంధ్ర బుక్ హౌస్, రామకృష్ణ మఠం , లేఖిని ప్రచురణలు, ఇస్కాన్ , అచ్చంగా తెలుగు ప్రచురణలు, అక్షరయాన్ బుక్ స్టాల్, కమల్ బుక్ సెంటర్ , నవ చేతన బుక్ హౌస్, నవోదయ ప్రచురణలు, టాగోర్ బుక్ హౌస్, తెలుగు విశ్వవిద్యాలయం, ఋషిపీఠం ప్రచురణలు, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం వంటి ఎన్నో ఎన్నో సుమారు రెండువందల పై చిలుకు సంస్థలు బుక్స్ తో కాంతులీనడం విశేషం.

కవిత్వం, సాహిత్యం , ఆధ్యాత్మికం , విప్లవం , తత్వం, జ్ఞానం, విజ్ఞానం … ఇలా అన్ని శాఖల అంశాల్నీ పుష్పగుచ్చం చేసి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పాత క్రొత్తల మేలు కలయికగా అటు ప్రాచీనం, ఇటు ఆధునికం … ఈ రెండు వెలుగుల మధ్య వందల, వేల , లక్షల గ్రంధాలు కొలువు తీరబోతున్నాయని పుస్తకాల ప్రాంగణాన్నిచూస్తే స్పష్టమవుతోంది.

విశ్వనాధ , శ్రీ శ్రీ , కరుణశ్రీ, చలం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి , జాషువా, కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కారా మాష్టారు, రావి శాస్త్రి, బాపు , ముళ్ళపూడి వెంకటరమణ , చిలకమర్తి, పిలకా గణపతి శాస్త్రి, క్రొత్తపల్లి వీరభద్రరావు, కేతు విశ్వనాధరెడ్డి , కాళోజీ నారాయణరావు , కాళీపట్నం రామారావు , చాగంటి సోమయాజులు (చాసో) , గురజాడ అప్పారావు , చాగంటి సోమయాజులు, ఉషశ్రీ, పెద్దిబొట్ల సుబ్బరామయ్య , గొల్లపూడి మారుతీరావు , పురాణం సుబ్రహ్మణ్యశర్మ , కె. శ్రీనివాస్, పురాణపండ రాధాకృష్ణమూర్తి, నండూరి రామ మోహనరావు , చాగంటి కోటేశ్వర రావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ, సిరివెన్నెల సీతారామశాస్త్రి ,వాడ్రేవు చిన వీరభద్రుడు, తల్లావజ్జుల పతంజలి శాస్త్రి , రామ్ గోపాల్ వర్మ, తనికెళ్ళ భరణి , సి. నారాయణరెడ్డి , నగ్నముని, శివారెడ్డి, వేటూరి సుందరామమూర్తి , మామిడి హరికృష్ణ , ఎమ్మెస్ సూర్యనారాయణ, జంపాల చౌదరి , అనుమాండ్ల భూమయ్య, కొలకలూరి ఇనాక్, బిక్కి కృష్ణ , నామాడి శ్రీధర్, వసీరా, ఒమ్మి రమేష్ , వివేక్ లంకమల, కుప్పిలి పద్మ, వాడ్రేవు వీరలక్ష్మీదేవి , భావరాజు పద్మిని ప్రియదర్శిని, ఐనంపూడి శ్రీలక్ష్మి, జ్యోతి వల్లబోజు, చంగల్వల కామేశ్వరి, స్వాతి శ్రీపాద, మంజులా సూర్య , మానస ఎండ్లూరి, మానస చామర్తి , రోహిణి వంజారి, పద్మజ మాచిరాజు, విజయలక్ష్మీ పండిట్, చిట్టే లలిత, అబ్దుల్ రాజా హుస్సైన్ , బి. వి. వి. ప్రసాద్ …. ఇలా ఎందరో విఖ్యాత రచయితల … కవుల, కవయిత్రుల , విమర్శకుల , పరిశోధకుల గ్రంథ పరిమళం మనస్సుని చల్లగా , మెత్తగా తాకడం మన అదృష్టంగానే చెప్పాలని కమిటీ పేర్కొనడం పుస్తక ప్రియులకు అదృష్టమని చెప్పాలి.

గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తన ప్రత్యేకతను నిస్వార్ధంగా ఒక ప్రవాహ శైలిలో స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సేవగా ఆవిష్కరించడాన్ని సాహితీప్రియులు, ఆధ్యాత్మిక వేత్తలు , పుస్తక ప్రియులూ ఈ విశేషాన్ని అభినందిస్తారుకూడా !

ఇప్పటికే పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనాలైన అఖండ గ్రంధాలు అమ్మణ్ణి, నేనున్నాను, శ్రీ పూర్ణిమ, శ్రీమాలిక, మహాసౌందర్యం, మహామంత్రస్య, యుగే యుగే వంటివి సృష్టించిన ఉదాత్తతకు వేల వేల సంఖ్యలో ఆయనకున్న అభిమానులే సాక్ష్యం.

ప్రఖ్యాత కవి యాకూబ్ ఈ బుక్ ఫెయిర్ కమిటీ కి అధ్యక్షులయ్యాక కవుల, రచయితలకు మరింత ఆసక్తి కలగటం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Leave a Reply