vaccinations | మూగ జీవాలకు”అమ్మ తల్లి”టీకాలు

vaccinations | మూగ జీవాలకు”అమ్మ తల్లి”టీకాలు
vaccinations | రెంజల్, ఆంధ్రప్రభ : రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో మూగజీవాలకు”అమ్మ తల్లి”టీకాల(vaccinations)ను స్థానిక సర్పంచ్ రెమ్మ భానుచందర్ వేశారు.పశు వైద్య,పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శ్రీకాంత్, జూనియర్ పశువైద్యాధికారి నాగరత్నంలతో కలిసి రెమ్మ భానుచందర్ మాట్లాడుతూ… గొర్లు-మేకల కోసం నట్టల నివారణ, ఉచిత మందుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వ్యాధి రాకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ టీకాలు వేయించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం(Govt) జీవాలకు ఏ సీజన్లో ఏ వ్యాధులు వస్తున్నాయో తెలుసుకొని మందులను వేయించడం పెంపకదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. గొర్లు-799, మేకలకు-497 వేయించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు హనుమంతు, వేణు, సిబ్బంది నవీన్, పెంపకదారులు కురుమే నర్సయ్య, కురుమే సాయిలు, కురుమే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
