Utnur | ఆదరించండి… అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

  • ఉట్నూర్ సర్పంచ్ అభ్యర్థి చారులత రాథోడ్

ఉట్నూర్ , ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే పంచాయతీని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తానని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి, మాజీ జెడ్పీటీసీ చారులత రాథోడ్ అన్నారు.

శుక్రవారం ఆమె పంచాయతీలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటి తిరిగి బ్యాలెట్ పేపర్లు, పోస్టర్లు అందజేస్తూ.. జెడ్పీటీసీగా ఎన్నో సేవలు చేశాను. ఈసారి మహిళా రిజర్వేషన్ రావడంతో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బరిలోకి దిగాను అని వివరించారు.

తన గుర్తు ఫుట్‌బాల్ కు ఓటేసి గెలిపిస్తే ఉట్నూర్‌లో సెంటర్ లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగులకు స్వయంప్రతిపత్తి కల్పించడంతో పాటు ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించే దిశగా పనేర్పడతానని హామీ ఇచ్చారు.

తన రాజకీయ అనుభవాన్ని ప్రజల కోసం వినియోగించి, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీని నమూనా పంచాయతీగా తీర్చిదిద్దుతానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని చారులత రాథోడ్ భరోసా ఇచ్చారు

Leave a Reply