Utnoor | పెండింగ్ వేతనాలు చెల్లించాలి

Utnoor | పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ గుమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వర్కర్ల ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇవాళ ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మటును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వర్కర్ల సమస్యలు తెలిపినట్లు రాష్ట్ర, జిల్లా గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ, సంఘ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం 2026 నూతన క్యాలెండర్ ను ఐటీడీఏ పీఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినట్లు జిల్లా గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సౌకత్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కే రామచందర్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజలింగు, ప్రధాన కార్యదర్శి వసంత్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దిలీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి స్వాతి, సంఘ నాయకులు సోనేరావు, రంభ, భరత్, లింగన్న, బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారని జిల్లా గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ తెలిపారు.
