Utkoor | అట్టహాసంగా సర్పంచ్ కప్ కబడ్డీ పోటీలు.

Utkoor | అట్టహాసంగా సర్పంచ్ కప్ కబడ్డీ పోటీలు.

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్లలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నిర్వహించిన సర్పంచ్ కప్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. కబడ్డీ పోటీలకు యువత ఉత్సాహంగా ఉల్లాసంగా హాజరై తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్, మాజీ సర్పంచ్ మాలి పటేల్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… కబడ్డీ పోటీలు శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహద పడతాయని అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు సర్పంచ్ కప్ పోటీలు నిర్వహించగా యువకులు, క్రీడాకారులు తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడడం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యవంతులు నిజమైన క్రీడాకారులని అన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగిన కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి వెంకటేష్ టీం, ద్వితీయ బహుమతి అనిల్ టీం కైవసం చేసుకుంది. గెలుపొందిన క్రీడాకారులను అభినందించి కప్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బందే నవాజ్, సంజప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply