Utkoor | మంత్రి సహకారంతో క్రీడాభివృద్ధికి కృషిచేస్తాం

Utkoor | మంత్రి సహకారంతో క్రీడాభివృద్ధికి కృషిచేస్తాం

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని ఓబులాపూర్ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, చిన్న పొర్ల మాజీ సర్పంచ్, మాలి పటేల్ రవీందర్ రెడ్డి అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్, చిన్నపొర్ల గ్రామాల్లో క్రీడాకారులకు మంత్రి సహకారంతో క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు విద్య, వైద్య క్రీడారంగాలకు ప్రాధాన్యత కల్పిస్తుందని, ప్రతి పల్లెలో క్రీడా స్ఫూర్తి చాటాలనే లక్ష్యంతో మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రతి పల్లెలో క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడారంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామన్నారు. యువత ప్రతినిత్యం క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ పుట్టిన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఉప సర్పంచ్ హన్మంతు, వాలీబాల్ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ గౌడ్, వార్డు సభ్యుడు బందే నవాజ్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, భీమకవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply