Utkoor | తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహకు ఘన సన్మానం

Utkoor | తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహకు ఘన సన్మానం

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా శాఖ నూతన అధ్యక్షులు నరసింహను నారాయణపేట జిల్లా ఊట్కూర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఇవాళ‌ ఘనంగా సన్మానించారు. సాంఘీక శాస్త్ర ఫోరం, బాలురు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మురళీధర్ మాట్లాడుతూ… యువకుడికి జిల్లా అధ్యక్ష బాధ్యత రావడం సంతోషదాయకమని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తారని నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ పురం జిల్లా అధ్యక్షులు రవికుమార్, అనిల్ కుమార్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నర్సప్ప, పద్మజా, శాంత స్నేహలత, జయశ్రీ, నాగేందర్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply