పుత్తూరు, (ఆంధ్రప్రభ) : పుత్తూరు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మత్తు పనులు, చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమం చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రేపు (శనివారం) పుత్తూరులో విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్టు తెలిపారు.
ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పుత్తూరు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పట్టణ, గ్రామీణ ఏఈలు జై సాయి, భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ ఈఈ ఆశీర్వాదం, డీఈఈ శంకరయ్య ఆదేశాల మేరకు ఈ పనులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం వల్ల వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ సమయంలో ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.