Us Pilot Rescued : అమెరికా ఫైల‌ట్ సేఫ్ Andhra Prabha News

Us Pilot Rescued : అమెరికా ఫైల‌ట్ సేఫ్ Andhra Prabha News

  • రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్
  • పర్వతాల్లో దాక్కున్న పైలట్లు.
  • ఉత్కంఠ భరిత గాలింపు
  • కోహ్గిలుయే లో రెస్క్యూ
  • ప‌ట్టిస్తే అర‌కోటి బ‌హుమానం
  • ఇరాన్ భారీ నజరానా ప్రకటన

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వాషింగ్ట‌న్ ప్ర‌తినిధి)

Us Pilot Rescued

Us Pilot Rescued : ఇరాన్ దాడిలో కూలిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్‌జెట్ పైల‌ట్ ను అమెరికా ర‌క్షించింది. ఈ విమానం కూలిన త‌రువా అత‌డి కోసం అమెరికా ముమ్మరంగా గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. అదే సమయంలో, “శత్రు పైలట్‌”ను అప్పగిస్తే భారీ న‌జ‌రానా ఇస్తామని ఇరాన్ కూడా ప్రకటించింది. “ఈ ధైర్యవంతుడైన యోధుడు ఇరాన్‌లోని ప్రమాదకర పర్వతాలలో శత్రువుల వెనుక ఉన్నాడు. గంటగంటకూ దగ్గరవుతున్న మన శత్రువులు అతడిని వేటాడుతున్నారు,” అని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఆయన రాశారు.

Us Pilot Rescued

Us Pilot Rescued : అమెరికా F-15E స్ట్ర‌యిక్ ఈగిల్ యుద్ధ విమానం కూలిపోయిన తర్వాత, ఇద్దరు పైలట్, వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ ను ఎట్ట‌కేల‌కు అమెరికా ద‌ళాలు కాపాడాయి. నైరుతి ఇరాన్ లోని కోహ్గిలుయే, బోయెర్-అహ్మద్ (Kohgiluyeh and Boyer-Ahmad) ప్రావిన్స్‌లోని అత్యంత ఎత్తైన, కఠిన పర్వత ప్రాంతంలో వీరు దొరికారు. విమానం కూలిపోయిన తర్వాత పారాచూట్ ద్వారా కిందకు దిగిన వీరు, ఇరాన్ దళాలకు దొరకకుండా కొండల్లో దాక్కున్నారు.

Us Pilot Rescued

Us Pilot Rescued : అమెరికా దళాలు ఈ ఇద్దరినీ వేర్వేరు ఆపరేషన్ల ద్వారా రక్షించాయి: ఈయనను విమానం కూలిపోయిన కొన్ని గంటల్లోనే, అంటే ఏప్రిల్ 3, 2024 (శుక్రవారం) రాత్రి రక్షించారు. ఈ కర్నల్ హోదా కలిగిన అధికారి : ఈయన రక్షణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్ ఏప్రిల్ 5, 2026 (ఆదివారం) తెల్లవారుజామున జరిగింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య ఈ స‌మాచారాన్ని అధికారికంగా ధృవీకరింయారు..

ALSO READ : 5 Dead 170 Injured Iran : అమెరికా దూకుడు Andhra Prabha News

Leave a Reply