us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks I 2505 I మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతుందా?

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామాలు
అణు నిల్వల అప్పగింతపై ఇరాన్ వైఖరి ఏమిటి?
హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటే ప్రపంచానికి లాభాలేనా?
చమురు సంక్షోభంపై ప్రపంచ దేశాల ఆందోళన
ఒప్పందం కుదిరితే అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం
us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయం : ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసిన ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో అని అన్నిదేశాలు ఎదురు చూస్తున్నాయి. గత కొంత కాలంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధిస్తున్నాయి. శాంతి ఒప్పందం, శాశ్వత కాల్పులు విరమణ అమెరికా, ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందానికి ఏకైక ఆటంకంగా ఉన్న ఇరాన్‌లోని అణు నిల్వలు అంశం. అయితే అణు నిల్వలు అప్పగించడానికి ఇరాన్ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఒకవేళ అణు నిల్వలు ఇచ్చే అంశంపై ఒప్పందం కుదిరితే యుద్ధం ఆగినట్లే. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిన ఇరాన్, అలాగే తర్వలో ఎన్నికల ఉన్న దృష్ట్యా అమెరికా కూడా ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తుది ఒప్పందం కోసం ఆరవై రోజులు పడుతుందని అమెరికా వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు.
us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks ఒప్పందాలపై అనుమానాలు
ఇరాన్, అమెరికా రెండు దేశాలు మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణ పురోగతి సాధించేలా అడుగులు వేస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని అంశాలపై ఒప్పందం కుదిరితే యుద్ధం ఆగిపోతుంది. కానీ ఆయా అంశాలపై ఒప్పందం కుదురుతుందా? అనేది అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండి చర్చలు సాగాయి. కానీ పురోగతి సాధించలేదు. అమెరికా ఎన్నో ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తర్వాత ఇరాన్ కూడా మెత్తపడినట్లు సమాచారం. ఇదే శాంతి ఒప్పందం వైపు ఇరాన్ కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. యురేనియం శుద్ధిపై పెద్దగా వివరాలు ఉండవు. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించడం తుది ఒప్పందంలో పెద్ద సవాలుగా మారనుంది. ఏదీఏమైనా ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే తప్పా యుద్ధం ఆగదు అనే స్పష్టం.

us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks న్యూక్లియర్ డస్ట్ ప్రధాన అంశం
ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని పొందకుండా ఈ ఒప్పందం నిర్ధారిస్తుంది. ఇరాన్ అధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవడానికి అంగీకరిస్తుంది. దీనిని ట్రంప్ తరచుగా “న్యూక్లియర్ డస్ట్” అని పిలుస్తుంటారు. ఇదే ఒప్పందాల్లో ప్రధాన అంశం. ఆ యురేనియం నిల్వలను ఎలా తొలగించాలి అన్నది తర్వాతి దశ చర్చల్లో నిర్ణయిస్తారు. ఈ ఒప్పందంలో ముఖ్యమైన విషయం ఇరాన్ తన వాగ్దానాలను అమలు చేయకపోతే వారికి ఏమీ దక్కదు. ‘డస్ట్’ లేకపోతే డాలర్లు కూడా లేవు. జలసంధి తెరుచుకున్న కొద్దీ దిగ్బంధనం సడలించబడుతుంది అని అమెరికా అధికారి చెప్పారు.
us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks ఇరాన్ మీడియా సందేహాలు
ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ ఒప్పందం నిజంగా కుదురుతుందా అనే విషయంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇరాన్‌కు చెందిన అర్ధప్రభుత్వ వార్తాసంస్థ కథనం ప్రకారం ఒప్పందంలోని ఒకటి లేదా రెండు నిబంధనలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks అమెరికా వాదన…
మరోవైపు ట్రంప్ కూడా ఈ ఒప్పందం దాదాపు పూర్తయ్యిందని చెప్పినప్పటికీ, అమెరికా తొందరపడబోదని ప్రకటించారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబమా కాలంలో కుదిరిన అణు ఒప్పందంతో ఇది భిన్నంగా ఉంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే అది మంచి. సరైన ఒప్పందం అవుతుంది. ఒబామా చేసినట్లుగా కాదని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక లో రాశారు. ఆ ఒప్పందం ఇరాన్‌కు అణు ఆయుధం పొందడానికి స్పష్టమైన మార్గం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ట్రంప్ మాత్రం పదేపదే చెబుతున్న విషయం ఏమిటంటే ఒక విధంగా అయినా ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోలకుపైగా అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవాల్సిందే. గత ఏడాది అమెరికా దాడుల తర్వాత ఆ నిల్వలలో చాలా భాగం భూగర్భంలో పాతిపెట్టబడిందని అమెరికా భావిస్తున్నది.

us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks తగ్గని ఉద్రికత్తలు
ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలమార్గం తిరిగి తెరవబడుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇదే క్రమంలో ఇరాన్ మీడియా, ఐఆర్‌జీసీలు మాత్రం ఈ జలసంధి ఇరాన్ పర్యవేక్షణలోనే కొనసాగుతుందని తెలిపాయి. 30 రోజుల వ్యవధిలో నౌకాయానం యుద్ధానికి ముందు స్థాయికి చేరేందుకు అనుమతిస్తామని పేర్కొన్నాయి. అదే సమయంలో ఇరాన్, తమ పోర్టులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఒప్పందం పూర్తిగా కుదిరి, ధృవీకరించబడి, సంతకం అయ్యే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని అన్నారు. జలసంధిని తెరవడం అంటే తమ నియంత్రణను వదులుకోవడం కాదని., జలసంధి ఇప్పటికే తెరిచి ఉంది. కానీ సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ అధికారులతో సమన్వయం అవసరం అని ఇరాన్ చెబుతున్న మాట.

us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks జలసంధికి అమెరికాతో సంబంధం లేదు
హోర్ముజ్ జలసంధికి అమెరికాతో సంబంధం లేదని, ఇది తమ తీర దేశాల మధ్య విషయం, ముఖ్యంగా ఒమాన్‌తో సంబంధించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అన్నారు. ఘర్షణ సమయంలో, జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఫీజులు విధించే హక్కు తమకు ఉందని ప్రకటించారు.
us-iran-peace-deal-hormuz-oil-crisis-nuclear-talks ఇదీ ఇరాన్ మాట…
శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడటం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఇందుకు బలపరుస్తోంది. ముందుగా శాంతి ఒప్పందం కుదుర్చుకుని.. ఆపై అందులోని అంశాలపై ఇరు దేశాలు కూలంకషంగా చర్చించే అవకాశాలున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ప్రతిపాదిత ఒప్పందంలో, ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయబోదని హామీ ఇవ్వనుంది. అలాగే అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునే విషయంపై చర్చలకు అంగీకరిస్తుంది. కొత్తగా యురేనియం శుద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తుంది. అయితే ఇరాన్ అధికారులు, యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే యురేనియంపై చర్చలు ప్రారంభమవుతాయని ఇరాన్ అంటుంది.

యురేనియం అనేది అణు ఇంధనం. దీనిని అధిక స్థాయిలో శుద్ధి చేస్తే అణు బాంబు తయారీలో ఉపయోగించవచ్చు. ఈ దశలో అణు అంశాలపై చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అన్నారు. అణు నిల్వలు అప్పగించడం, పరికరాలను తొలగించడం, కేంద్రాలను మూసివేయడం లేదా అణు బాంబు తయారు చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలపై ఇరాన్ ఎలాంటి అంగీకారం ఇవ్వలేదు అని చెప్పారు.
