Urea | కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం..

Urea | కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం..
— కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో విఫలం
— రబీ సీజన్లోను రైతులకు తప్పని యూరియా తిప్పలు
— హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి
Urea | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ పోరాటం, దీక్షా దివస్ వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిందని హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు.
ఈ రోజు స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎవరెన్ని చెప్పిన కేసీఆర్ పోరాట ఫలితం, విద్యార్ధుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం(Telangana State) వచ్చిందని, కేసీఆర్ ను విమర్శిస్తే సూర్యునిపై ఉమ్మేసినట్లే ఉంటుందని కేసీఆర్ ను విమర్శించే నాయకులకు చురకలు అంటించారు. హుజూర్‌నగర్ నియోజక వర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు పోలీసులతో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు(illegal cases) నమోదు చేస్తున్నారని విమర్శించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ రబీ సీజన్ లో కూడా రైతులకు యూరియా(Urea) కష్టాలు తప్పడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పు గ్రామ పంచాయతీ ఎన్నికలలో 17 శాతమే ఇచ్చిందని ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలలో ప్రజలు నిలదీయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు బెల్లంకొండ అమర్, దొండపాటి అప్పిరెడ్డి, పచ్చిపాల ఉపేందర్, తేజావత్ బాలాజీ నాయక్ వీరమల్ల సుందర్ రాగి రాజశేఖర్ దగడ గోపి తదితరులు పాల్గొన్నారు.
