కావలసినంత యూరియా అందుబాటులో ఉంది

కావలసినంత యూరియా అందుబాటులో ఉంది
జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : యూరియాపై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని రైతులకు కావలసిన యూరియా సిద్ధంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ లో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణ రెడ్డి విలేకర్లతో మాట్లాడాతు.. గత ఏడాదిలో ఈ సీజన్ కు 23000 బస్తాలు సరఫరా అయ్యాయని, ఈ సీజన్ లో ఇప్పటికే మండలానికి 48,000 బస్తాలను సరఫరా చేశామని అన్నారు.
మరో 20,000 బస్తాలు సరఫరాకు సిద్ధంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందకుండా అవసరం లేకుండా యూరియా బస్తాలు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు. వచ్చే సీజన్ కు కూడా కావలసినంత యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. వదంతులు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారిని బి.పూజ, పిఏసిఎస్ సిఈఓ బి.శేఖర్, రైతులు నోముల మాధవరెడ్డి, ఏపూరి సతీష్, జక్కిడి చంద్రారెడ్డి, బొడ్డుపల్లి యాదయ్య పాల్గొన్నారు.
