Urea | యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలి

Urea | యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలి

  • సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

Urea | చండూర్, ఆంధ్రప్రభ : యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఈ రోజు చండూరు మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం మొగుదాల వెంకటేశం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చదువు రానటువంటి రైతులు ఆన్లైన్ బుకింగ్ విధానం ఏ రకంగా చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుకు నష్టం కలిగించే మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ ను ప్రైవేటుకరించే విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం లోని అధికారాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించడం సరైనది కాదు అని ఆయన అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ బిల్లు, 2025 జి ఆర్ఎఎంజి ను రద్దు చేయాలని ఆయన అన్నారు. నిత్యవసర సరుకుల నియంత్రించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందన్ని, దీనివల్ల పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు, బహుల జాతి ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. పేదల సంపదను పెద్దలకు దోచి పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ఆయన అన్నారు.

వామపక్ష మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సీపీఎం సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం,చిట్టి మల్ల లింగయ్య, సీపీఎం మండల కమిటీ సభ్యులు కొత్తపల్లి నరసింహ, గౌసియా భేగం, బల్లెం స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply