Uppuluru | అమానుష ఘటన..

Uppuluru | అమానుష ఘటన..

  • బరిలో డబ్బులు దొంగతనం చేశారని చొక్కాలు విప్పించిన నిర్వాహకులు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Uppuluru | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : కృష్ణాజిల్లా కంకిపాడు ఉప్పులూరు కోడిపందాల భరీ వద్ద అమానుష ఘటన చోటు చేసుకుంది. బరి వద్ద డబ్బులు తీసారనే నెపంతో బట్టలూడదీసి తాళ్లతో నిర్వాహకులు కట్టేశారు. పందెం బరి వద్ద నిర్వహించే పత్తలా ఆట కోసం తోట్లవల్లూరుకి చెందిన కొందరిని కూలి కోసం నిర్వాహకులు తీసుకుని వెళ్లారు. ఆటలో వచ్చిన లెక్కల్లో తేడాలు రావడంతో నిర్వాహకులు బట్టలూడదీసి తాళ్లతో కట్టేశారు. తాళ్లతో కట్టేసి దాడి చేసి వీడియో తీశారు. ఈ వ్యవహారం ఎస్పీ సిరియస్ కావడంతో నిర్వాహకుల్లో కొందరిపై కంకిపాడు పోలీసులు.. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Uppuluru

అమానుష ఘటనపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరుగగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. తాము డబ్బులు దొంగతనం చేయలేదని తోట్లవల్లూరు గ్రామానికి చెందిన వారు చెబుతున్నప్పటికీ వినకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంపై పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించి కొందరిపై కేసు నమోదు చేయడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా చొక్కాలు విప్పించి దాడి చేయడం, చేతులను తాళ్లతో కట్టేయడంతో నిర్వాహకులు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply