మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచులు హోరాహోరీగా సాగుతున్నాయి. బెంగళూరు వేదికగా నేడు ఈ సీజన్‌లో 9వ మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్‌సీబీ యూపీ వారియర్స్‌తో తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్.. బౌలింగ్ ఎంచుకుని బెంగళూరు జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
జట్టు మార్పులు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : వీజే జోషిత స్థానంలో స్నేహ రాణా తుది జట్టులోకి చేరింది.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ : స్మృతి మంధాన (కెప్టెన్), డేనియల్ నికోల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ ఆనంద్ బిస్త్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, కిమ్ గర్త్, ఏక్తా బిష్త్, రేణుకా బిష్త్
యుపి వారియర్జ్ ఉమెన్స్ : కిరణ్ ప్రభు నవ్‌గిరే, దినేష్ వృందా, దీప్తి శర్మ (కెప్టెన్), గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, శ్వేతా సెహ్రావత్, చినెల్లే హెన్రీ, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, సోఫీ ఎక్లెస్టోన్, సైమా ఠాకూర్
ఉత్కంఠ రేపుతున్న మహిళల మ్యాచ్‌లు
కాగా, నేటి మ్యాచ్ బెంగళూరు జట్టుకు కీలకంగా మారింది. గత మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడిన బెంగళూరు జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాపర్ గా తమ మరింత స్థానాన్ని పటిష్ఠం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న యూపీ.. నేటి మ్యాచ్‌లో గెలిచి పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా నిలిచేందుకు మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ (నాలుగు పాయింట్లతో) టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(నాలుగు పాయింట్లు), గత రెండు సీజన్లలోనూ రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ (నాలుగు పాయింట్లు) రేసులో చేరాయి.
దీంతో లీగ్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. నేడు జరగనున్న మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిపాలైతే… యూపీ జట్టు ఖాతాలో కూడా నాలుకు పాయింట్లు వస్తాయి. దీంతో యూపీతో జరగబోయే మ్యాచ్ ఆర్సీబీకి కీలకంగా మారింది.