Office | కానరాని హౌసింగ్ అధికారులు

Office | కానరాని హౌసింగ్ అధికారులు

తాళాలకే పరిమితమైన హౌసింగ్ కార్యాలయం

Office | నాగాయలంక, ఆంధ్రప్రభ : ప్రభుత్వం వారిచే హౌసింగ్ నిర్మాణాలు చేసుకునే వారికి ఈ నెల 30వ తేదీ వరకు నూతన దరఖాస్తులను కోరుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, నాగాయలంక మండల కేంద్రంలో ఉన్న హౌసింగ్ ఏఈ కార్యాలయం Housing AE Office తాళాలకే పరిమితం అవడంతో కార్యాలయం చుట్టూ అర్జీలు సమర్పించడానికి ప్రదక్షిణ చేస్తున్న దరఖాస్తుదారులు. కార్యాలయం తాళాలు వేయడంతో సంబంధిత అధికారిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించిన స్పందించడం లేదని వేరొక నెంబర్లతో ఫోన్ చేసిన అదే పరిస్థితి ఎదురవడం, రేపటితో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో గందరగోళ పరిస్థితుల్లో నూతనంగా అర్జీలు పెట్టుకోదలచిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయం వద్దకు చేరుకొని విచారించగా 12 గంటల సమయంలో అప్పుడప్పుడు వస్తారంటూ, కొన్ని కొన్ని రోజులైతే తాళాలు కూడా తీయడం లేదంటూ చుట్టుపక్కల నివాసితులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నత శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని అర్జీ దారులలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు స్వస్తిపలికి సత్వర న్యాయం చేయాలని కోరుతున్నారు.

Leave a Reply