ఎక్స్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదిక(X platform)గా ఒక పోస్ట్ పెట్టారు.
లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్(Basarat Khan) దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు? ఆ కార్లు బీఎసఆర్ పార్టి అధినేత కేసీఆర్(KCR) కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి?
మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా?
పేమెంట్లు బినామీ పేర్లతోనా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారానా? అని ప్రశ్నించారు.
ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని నిలదీశారు. వాస్తవాలు బయటకు రావాలాంటే సంబంధిత శాఖలు ఇన్వెస్టిగేట్(Investigate) చేయాలి అని పేర్కొన్నారు.
