​డబిల్పూర్ లో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండల ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబీల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 40 నుండి 45 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

మృతురాలు గులాబీ మరియు నారింజ రంగు (Pink and Orange) చీర, జాకెట్టు ధరించి ఉంది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు గానీ, ఆమె పేరు, చిరునామా లేదా బంధువుల వివరాలు తెలిసిన వారు వెంటనే మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు…

Leave a Reply