కర్నూలులో యువకుడి దారుణ హత్య…

కర్నూలులో యువకుడి దారుణ హత్య…

స్నేహితుల మధ్య మద్యం మత్తులో ఘర్షణ
– ప్రాణాలు కోల్పోయిన కిరణ్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలో యువకుడి హత్య ఘటన కలకలం రేపింది. నగరంలోని బిర్లాగడ్డ ప్రాంతానికి చెందిన బోయ కిరణ్ (18) స్నేహితుల దాడిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి బోయ కిరణ్ తన స్నేహితులతో మాట్లాడేందుకు బయటకు వెళ్లాడు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న వారి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తి, అది క్రమంగా ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తులైన స్నేహితులు కిరణ్‌పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

అనంతరం స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బిర్లాగడ్డ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన కారణాలు, సంబంధిత వ్యక్తులపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply