‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమం

‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామ మండల ప్రాథమిక పాఠశాలలో ‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సుందిళ్ల శంకరమ్మ, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దుర్గం శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్’ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ కనీస అక్షర జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే ప్రభుత్వం అందించే పథకాలు, సేవలను సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. చదువుకు వయస్సుతో సంబంధం లేదని, అక్షరాస్యతతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భువనగిరి మధుసూదన్, ఉపసర్పంచ్ నల్లుల మహేష్, సింగిల్ విండో డైరెక్టర్ మాసాడి తిరుపతి, మాజీ సర్పంచ్ సుందిళ్ల భూమయ్య, ఎమ్మార్పీ తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
