ఆదర్శ పాఠశాల్లో ఉగాది వేడుకలు..

ఆదర్శ పాఠశాల్లో ఉగాది వేడుకలు..
కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లోని విశ్వాస నామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం చెబుతూ అంగరంగ వైభవంగా ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉగాది పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఏత్రాజు రాజు తెలియచెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది తెలుగు నామ సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు అంగరంగ వైభవంగా జరుపుకోవాలన్నారు.. ఉగాది విశిష్టతను వివరంగా తెలియజేసారు. ప్రతి ఒక్కరు పండగ గురించి తెలుసుకొని అంగరంగ వైభవంగా, సంబరంగా జరుపుకోవాలి అన్నారు. విద్యార్థులకు ఉగాది పచ్చడిని తయారు చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
