డిండి వాగులో పడి.. ఇద్దరు మృతి..
బాలుడు గల్లంతు
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ (Nalgonda) జిల్లాలో పండగ పూట ఘోర విషాదం నెలకొంది. పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు తెనాలి నుండి చందంపేట మండలం దేవరచర్లకు వచ్చిన ఓ కుటుంబం, వారి బంధువులు అనుకోని దుర్ఘటనతో శోకసంద్రమైంది. దసరా రోజు జరిగిన దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ దుర్ఘటన..
ఈ రోజు ఉదయం డిండి వాగులో స్నానం కోసం సాయి ఉమాకాంత్ (Sai Umakant) (10) అనే బాలుడు దిగాడు. అయితే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆ బాలుడిని రక్షించేందుకు వాగులోకి ఎంబీబీఎస్ విద్యార్థి రాము (student ramu) (30), మరో యువకుడు గోపన్న (Gopanna) (21) దిగారు. వారు కూడా వాగులో కొట్టుకుపోయారు. ఇది గమనించి గ్రామస్థులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే వారిద్దరు చనిపోయారు. గల్లంతైన సాయి ఉమాకాంత్ అనే బాలుని ఆచూకీ లభ్యం కాలేదు. ఊరు ఊరంతా పండుగ వేడుకల్లో సంతోషంగా ఉన్న సమయంలో అనుకోని ప్రమాదంలో ఇద్దరి యువకులు చనిపోవడంతో దామరచర్ల గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.

