హైదరాబాద్, ఆంధ్రప్రభ : లండన్(London)లోని జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident)లో హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా.. రెండు కార్లు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో తర్రె చైతన్య(Tarre Chaitanya) (23), రిషితేజ(Rishi Teja) (21)గా గుర్తించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి క్షతగాత్రులను అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు.
ఉన్నత విద్య కోసం వెళ్లి…
హైదరాబాద్‌లోని నాగర్ గుల్‌కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మల చిన్నకుమారుడు చైతన్య బీటెక్ పూర్తి చేసి.. హయ్యర్ స్టడీస్ కోసం ఎనిమిది నెలల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ వినాయకచవితి ఉత్సవాలను జరుపుకుని ఎనిమిది మంది ఫ్రెండ్స్‌తో కలిసి రెండుకార్లలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. అంతా పూర్తి చేసి తిరిగి వస్తుండగా.. వారి కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో చైతన్య, రిషితేజ మరణించారని ఆయా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.