Shamirpet | పొన్నాల చెరువులో ఇద్దరు గల్లంతు..

  • గళ్లంతైనా వారి కోసం గాలింపు

శామీర్ పేట, (ఆంధ్రప్రభ): శామీర్ పేట మండలం పొన్నాల చెరువులో ఇద్దరు యువకులు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గళ్లంత‌య్యారు.

స్థానిక పోలుసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈరోజు (ఆదివారం) ఆరుగురు యువకులు పొన్నాల చిత్తరమ్మని దర్శించుకున్నారు. అనంత‌రం.. ముగ్గురు యువకులు చెరువులోకి ఈతకు వెళ్ళారు. అయితే అందులో మరో ఇద్దరు (పాలసంతుల బాలు, అలలికంటి సందీప్ సాగర్) చెరువులో గల్లంతు అయ్యారని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం శామీర్పేట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు శామీర్ పేట ఎస్ హెచ్ ఓ శ్రీనాథ్ తెలిపారు.

Leave a Reply