ఇద్దరు మృతి

ఇద్దరు మృతి

గంగాధర ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చోటుచేసుకుంది.
మంగళవారం గంగాధర మండల కేంద్రంలోని సాయి విన్నర్స్ హై స్కూల్ కరస్పాండెంట్ మల్లయ్య కరీంనగర్ నుండి కారులో వస్తుండగా వెనక నుండి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.
దీంతో అదుపుతప్పి కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్ ప్రయాణిస్తున్న కరస్పాండెంట్ మల్లయ్య తో పాటు ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
ద్విచక్ర వాహనదారుని వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply