కర్నూలు బ్యూరో (ఆంధ్రప్రభ) : కౌతాళం మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పెళ్లికి సంబంధించి టెంట్ వేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగల తగిలి ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతి చెందిన వారిలో సునీల్ (30), మహీంద్రా (22) ఉన్నారు. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన ఎస్సీ ఈరమ్మ, విజయ్ కుమారుడు సునీల్ (నాని), మహీంద్రాలు వివాహ వేడుకలకు సప్లై సామాన్లను సరఫరా చేస్తారు.
ఈ క్రమంలో గ్రామంలో ఓ వివాహ వేడుకకు టెంటు వేస్తుండగా విద్యుత్ శాక్ కు గురయ్యారు. మరణించిన సునీల్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండవ వ్యక్తి అదే గ్రామానికి చెందిన నాగమ్మ, తిక్కన్న దంపతులకు నలుగురు కుమారులు. అందులో మూడవ కుమారుడు మహేంద్ర (22). ఇతనికి ఇంకా వివాహం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.