స్కూళ్లకు బాంబు బెదిరింపు..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాల్వియా నగర్‌ (Malviya Nagar)లోని SKV హౌజ్ రాణి, కరోల్‌బాగ్‌ (Karol Bhag) ప్రాంతంలోని ఆంధ్ర స్కూల్ (Andhra School)కు బుధవారం ఉదయం ఓ ఆగంతకుడు ఆ రెండు స్కూళ్లలో బాంబు పెట్టానంటూ ఈ-మెయిల్‌లు పంపాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు బాంగ్, డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. ఈ మేరకు రెండు పాఠశాలల్లోని విద్యార్థులు, సిబ్బందిని బయటకు పంపి క్షణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కాగా, ఈనెల 18న ద్వారక ప్రాతంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌‌కు ఓ ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు స్పాట్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ తరువాత ఎక్కడా బాంబులు లేవని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply