అన్నను కాపాడేందుకు వెళ్లి …
నిర్మల్ టౌన్, అక్టోబర్ 7 (ఆంధ్రప్రభ) : నిర్మల్ (Nirmal) పట్టణంలోని నాయుడు వాడకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు బంగాల్పేట్ వినాయక సాగర్ చెరువులో పడి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాయుడు వాడ (Naidu Vada) లో నివాసం ఉంటున్న మాన్పురి నరేష్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. అది గమనించిన తమ్ముడు నవీన్ అన్నను కాపాడేందుకు చెరువులో దూకాడు.
రక్షించే ప్రయత్నంలో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.