తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో కొందరు వ్యక్తులు డ్యాన్స్‌లు చేసి, అసభ్య చర్యలతో సోషల్ మీడియా రీల్స్ చేయ‌డం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా స్పందించింది.

భక్తి, ఆరాధన కేంద్రమైన పవిత్ర తిరుమల ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇలాంటి అనుచిత చర్యలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తితిదే వెల్లడించింది. భక్తుల మనోభావాలను గౌరవించకుండా ఈ వీడియోలను చిత్రీకరించడాన్ని తాము సహించబోమని స్పష్టం చేసింది.

ఇలాంటి ఘటనలపై విజిలెన్స్ సిబ్బంది ఇప్పటికే చర్యలు ప్రారంభించారని, బాధ్యులపై కేసులు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తితిదే హెచ్చరించింది. తిరుమలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరగాలని, ఈ పవిత్రతను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందని తిథి స్పష్టం చేసింది.

Leave a Reply