ఉద్యోగి, ఉద్యోగ విరమణ భద్రత కరువు…

ఉద్యోగి, ఉద్యోగ విరమణ భద్రత కరువు…
- మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైంది,
టీఎస్ సీపీఎస్ఈ యు జిల్లా అధ్యక్షులు దిల్షాద్
చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన, సిపిఎస్ రద్దు పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని, టీఎస్ సీపీఎస్ఈ యు జిల్లా అధ్యక్షులు దిల్షాద్, అన్నారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు , రెవెన్యూ ఉద్యోగులు మాజీ మండల అధ్యక్షులు కానుగుల రఘుపతి మాట్లాడుతూ.. సి పిఎస్ ఉద్యోగి, ఉద్యోగ రమణభద్రతకరువైందన్నారు .
సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. టి ఎస్ ఎస్ టి యు మండల అధ్యక్షులు బొమ్మ రాజమౌళి, ఆర్ ఐ, రాజేందర్, ఉపాధ్యాయులు, నీలిమారెడ్డి, కల్పన, సాంబమూర్తి, శరత్ బాబు, పావని ,లావణ్య, లక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు.
