TRUST | పెద్దబుగ్గ ఆలయంలో అన్నప్రసాదం

TRUST | పెద్దబుగ్గ ఆలయంలో అన్నప్రసాదం


TRUST | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా పెద్దబుగ్గ దేవాలయంలో ఇవాళ‌ భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సోమవారం భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో, దాతల సహకారంతో నియమితంగా అన్నదానం కొనసాగుతున్నట్లు అన్నదాన ట్రస్ట్ చైర్‌పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు తెలిపారు.

బెల్లంపల్లికి చెందిన దాతలు సిలువేరు నర్సింగం – విజయలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఈ వారం అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తుల సేవే మహాదేవాలయ పరంపరలో ప్రధాన లక్ష్యమని, ముందుముందు కూడా ఇదేవిధంగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ములకూరి బాలకృష్ణ, వినయ్, సాగర్, సతీష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply