హెచ్ -1బీ వీసాలో మరిన్ని మార్పులు

వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మ‌రో బాంబు పేల్చారు. కొత్తగా జారీ చేసే హెచ్ 1బీ వీసాల (H-1B visa) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్ల ఫీజు విధించిన సంగ‌తి తెలిసిందే. ఇదే వీసాలో మ‌రిన్ని మార్పులు తీసుకొచ్చారు. హెచ్ -1బీ వీసా కార్యక్రమంలో మరిన్ని మార్పులను ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదించింది. ‘రిఫార్మింగ్ ద హెచ్-1బీ నాన్ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ కింద ఈ కొత్త ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్లో నమోదయ్యాయి.

డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ర్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల మేరకు వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు వీసా ప్రోగ్రామ్ (Visa program) నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టిసారించనున్నారు. ఈ మార్పులు హెచ్-1బీ వీసా సమగ్రతను మెరుగుపర్చడానికి, కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చినవ‌ని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఆందోళన వ్యక్తమవుతోన్నప్పటికీ వీసా ప్రోగ్రామ్ లో మార్పులు మాత్రం ఆగడం లేదు. హెచ్-1బీ కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని మార్చేలా హోమ్ర్యాండ్ సెక్యూరిటీ ఇప్పటికే ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply