జగన్మాతకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి వేడుకోలు..

  • ఎమ్మెల్యే సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ హాజరు

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అరాచక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి చెప్పారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రులలో 5వరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి కనక దుర్గమ్మ దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

అనంతరం గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ… రావణ సంహార కోసం శ్రీరాముడు తొమ్మిది రోజులపాటు పూజలు చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోది దేశంలోని శక్తి పీఠాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గతవారం త్రిపుర రాష్ట్రంలోని త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్నానని, ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

దేశ ప్రజలందరికీ ఆయురారోగ్య, ఐశ్వర్యాలను అమ్మవారు ప్రసాదించాలని ఆకాంక్షించారు. దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, దుర్గగుడి దేవస్థాన ఈవో, జిల్లా కలెక్టర్ లక్ష్మీ సార్ సిపి రాజశేఖర్ బాబులకు కు అభినందనలు తెలిపారు.

Leave a Reply