జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

చిట్యాల, ఆంధ్రప్రభ ; సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త డా,బాబూ జగ్జీవన్ రాం అని చిట్యాల మాజీ సర్పంచ్ జిట్ట నగేష్,కెవిపియస్ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు లు అన్నారు.

చిట్యాల మున్సిపల్ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో కెవిపియస్ ఆధ్వర్యంలో జరిపిన జగ్జీవన్ రాం జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. దేశ ఉప ప్రధాని గా , సామాజిక న్యాయ సాధన కోసం జగ్జీవన్ రాం చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కెవిపియస్ మండల నాయకులు గాదె ఎల్లేష్, రైతు సంఘం మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, ఐతరాజు యాదయ్య,గుండాల యాదయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు గాదె క్రిష్ణ,చొప్పరి అంజయ్య, పోతులూరి, స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply