పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు

పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు

రవీంద్ర రావు అదనపు కమిషనర్

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్ర ప్రభ : విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పుట్టపర్తి నారాయణచార్యులు జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ (జనరల్)ఏ. రవీంద్రరావు పుట్టపర్తి నారాయణచార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి, సిబ్బందితో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్ర రావు మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణచార్యులు తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలు అపారమని తెలిపారు.

వారి రచనలు సాంప్రదాయ విలువలను ప్రతిబింబిస్తూ, భాషా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయని కొనియాడారు. యువత ఆయన రచనలను అధ్యయనం చేసి, సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొని పుట్టపర్తి నారాయణచార్యులకు నివాళులర్పించారు.

Leave a Reply