Tributes | మండలి, గొట్టిపాటికి నివాళులు

Tributes | ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతు పెద్ద, పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య 127వ జయంతి, దివిసీమ గాంధీ, తెలుగు జాతి రత్నం మండలి వెంకట కృష్ణారావు(Venkata Krishna Rao) శత జయంతి సందర్బంగా వారి చిత్రపటాలకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాదులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్మరణ సభను(Memorial service) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయులు మండలి వెంకట్రామ్, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, ఏఎంసీ చైర్మెన్ తోట కనకదుర్గ, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్(Ainapudi Bhanu Prakash), పీఏసీఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య మనుమడు గొట్టిపాటి జవహర్, గొట్టిపాటి జవహర్..నీరజ, కొండపల్లి భానూ ప్రసాద్..కళ్యాణి దంపతులు, గొర్రెపాటి సురేష్, శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కుంపటి చిట్టిబాబు, నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply