Tributes | పీవీ సేవలు చిరస్మరణీయం

Tributes | పీవీ సేవలు చిరస్మరణీయం
- బహుభాషా కోవిదుడికి నివాళి
- ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి
Tributes | ఊట్కూర్, ఆంధ్రప్రభ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు బహుభాషా కోవిదుడని, దేశానికి ఆయన చేపట్టిన సేవలు చిరస్మరణీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు హన్మంతు, మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఎల్కోటి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు పెట్టించిన ఘనుడు దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు అని కొనియాడారు. అప్పట్లో కేంద్రంలో సంఖ్యా బలం లేకున్నా పూర్తికాలం ప్రభుత్వాన్ని నడిపిన ఘనత ఆయనకే సొంతమని అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం పీవీ నరసింహారావు స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు. పీవీ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు శంకర్, భరత్, వసంత్, లక్ష్మణ్, రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
